టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

దివంగత సైనికుడి భార్యకు కారుణ్య నియామకం!!

గత సంవత్సరం నవంబరు 8న కశ్మీరులో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన సైనికుడు ప్రవీణ్‌ కుమార్‌ భార్య రజితకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె జిల్లా సైనికాధికారికి పత్రాలతో దరఖాస్తు చేసుకున్నారు. తిరుపతిలోని ఎస్వీ విశ్వవిద్యాలయంలో ఆమె బీఎస్సీ, గుంటూరు జిల్లాలోని ఏఎన్‌యూలో ఎంఎస్సీ మైక్రోబయాలజీ చదివారు. వయసు, విద్యార్హతను పరిశీలించిన అనంతరం ఆమెకు జిల్లాలోని ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంటు లేదా ఆ స్థాయి ఉద్యోగం ఇవ్వాలంటూ విజయవాడలోని సైనిక సంక్షేమ డైరెక్టర్‌ ప్రభుత్వానికి విన్నవించారు. రెండేళ్లలో ఇందుకు సంబంధించి పరీక్షల్లో ఆమె ఉత్తీర్ణత సాధించాలని ఉత్తర్వుల్లో పేర్కొంటూ ఈ విషయమై తదుపరి చర్యలు తీసుకోవాలని సైనిక సంక్షేమ డైరెక్టర్‌, జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •