ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

పామాయిల్ తో చేసిన వంటలు తింటున్నారా??

ఆహారం తయారు చేయడానికి కొన్ని కొన్ని హోటళ్ల లో, రెస్టారెంట్ లో, కొందరి ఇళ్లలో సైతం ఎక్కువగా వాడుతున్న ఆయిల్.. పామ్ ఆయిల్. మద్యం, స్మోకింగ్ ఆ రెండూ కలిస్తే వచ్చే నష్టం కంటే కూడా పామ్ ఆయిల్ వాడటం వల్ల కలిగే నష్టాలే ఎక్కువ అని చెప్పక తప్పదు. భారత దేశమే ప్రపంచం మొత్తంలో పామ్ ఆయిల్‌ని అధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం . ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల లో పామ్ ఆయిల్‌నే వాడుతున్నారు. దీని వెనక ఉన్న ప్రధాన కారణం ఏమిటంటే మిగతా వంట నూనెల కంటే పామాయిల్ ధర కూడా తక్కువ. అయితే ఆరోగ్య నిపుణులు ఈ పామ్ ఆయిల్ వెనుక పెద్ద మాఫియా ఉందని అంటున్నారు.

పామ్ ఆయిల్‌తో ఆహారం తయారు చేసుకోవడం వలన ఆరోగ్యానికి ఎలాంటిముప్పు కలుగుతుందో తెలియక చాలా మంది ఈ నూనెతో చేసిన వంటకాలు తింటున్నారు. పెద్ద పెద్ద కంపెనీల్లో బిస్కెట్లు, కుకీల తయారీలో పామ్ ఆయిల్‌నే వాడుతుండడం ఆశ్చర్యకరం! చాక్లెట్స్ తయారీలో కూడా దీన్నే వాడుతున్నారు. మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని భావిస్తాం కానీ పామ్ ఆయిల్ లేదా పాల్మిటిక్ యాసిడ్ కు మన ప్రాణాలు తీసే శక్తి ఉంది.లేస్ లాంటి కంపెనీలు ,విదేశాల్లో అమ్మే ఉత్పత్తులు వండటానికి వేరే వంట నూనె వాడుతూ కూడా ఇండియాలో అమ్మే వాటికి మాత్రం పామ్ ఆయిల్‌ని వాడుతున్నాయని నిపుణులు తెలియచేస్తున్నారు.

ఇలా పామాయిల్‌తో తయారు చేసినవి తిన్న ప్రతిసారీ పిల్లల మెదడు దెబ్బతింటూనే ఉంటుంది. పామాయిల్ తో చేసిన ఆహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, చాలా చిన్న వయసులో షుగర్ వ్యాధి కి గురవుతున్నారు. కాబట్టి పిల్లల కోసం ఏదైనా కొనేటప్పుడు ఆ వస్తువుల్లో పామ్ ఆయిల్, పాల్మొలినిక్ ఆయిల్, పాల్మిటిక్ యాసిడ్ వంటివి కలిపినట్లు ఉంటే వాటిని అస్సలు కొనవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •