అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

పాకిస్తాన్ లో మాజీ దౌత్యాధికారి షౌకత్ అలీ కుమార్తె దారుణ హత్య!!

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో మాజీ దౌత్యాధికారి షౌకత్ అలీ ముకద్దం కుమార్తె నూర్ ముకదం (27) దారుణ హత్యకు గురైంది. ఈమెను ఇస్లామాబాద్ లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సీఈఓ కొడుకైన జాహిద్ జఫర్ హతమార్చినట్టుగా తెలుస్తుంది. నగరంలోని ఒక ఫ్లాట్ లో నిందితుడు గన్ తో కాల్చి చంపి ఆమె శరీరాన్ని ముక్కలు చేశాడని పోలీసులు చెప్తున్నారు. ఈ దాడిలో మరొకరు కూడా గాయపడినట్టు, నూర్ ఫ్రెండ్ ని కూడా పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.

కొంత కాలంగా నూర్ జాహిద్ జఫర్ తో దూరంగా ఉండడం సహించలేక ఆమెను హతమార్చాడని, డ్రగ్ అడిక్ట్ అయిన ఇతడు సైకలాజికల్ సమస్యలతో బాధపడుతున్నట్టుగా, ఈ నెల 20 న నూర్ ఇతని ఇంటికి వెళ్లగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తుంది. కాగా నూర్ తండ్రి షౌకత్ అలీ లోగడ సౌత్ కొరియాకు, తజకిస్థాన్ కు కూడా పాక్ రాయబారిగా పని చేశారు. నూర్ హత్యను పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఆమె కుటుంబానికి సంతాపం తెలిపింది. నిందితునికి కఠిన శిక్ష విధించాలని కోరుతుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •