వార్తలు (News)

తెలంగాణాలో సినిమా థియేటర్లకు ఊరట??

కరోనా కారణంగా మూతపడిన సినిమా థియేటర్లకు ఆర్థికంగా వెసులుబాటు కలిగేలా పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్ల వద్ద యాజమాన్యం సినిమాకు వచ్చే ప్రేక్షకుల నుంచి వాహనాల పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.

2018లో పార్కింగ్ ఫీజులను రద్దు చేస్తూ జారీ చేసిన జీవో నెం.63ను సవరిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రమే వర్తిస్తాయని, మల్టీఫ్లెక్స్ లు, వ్యాపార వాణిజ్య సముదాయాల్లో ప్రజల నుంచి పార్కింగ్ ఫీజులు వసూలు చేయవద్దని ఆదేశించింది.

చాలామంది సినిమా థియేటర్ల వద్ద వాహనాలు పార్కింగ్ చేసి వెళ్లడం, పర్యవేక్షణ లేకపోవడంతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న యాజమాన్యాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం థియేటర్ల వద్ద నిలిపి ఉంచే వాహనాలకు నిర్ణీత రుసుము వసూలు చేసి వాటి పర్యవేక్షించాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    93
    Shares
  • 93
  •  
  •  
  •  
  •