క్రైమ్ (Crime) వార్తలు (News)

తిరుపతిలో పట్టుబడిన హైటెక్ వ్యభిచారం??

ఆంధ్రప్రదేశ్ లోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి పట్టణంలో హైటెక్ వ్యభిచార దందా గుట్టును తిరుపతి పోలీసులు బట్టబయలు చేశారు. తిరుపతి పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో రహస్యంగా కొనసాగుతున్న వ్యభిచార దందా వెలుగులోకి రావడంతో అంతా అవాక్కయ్యారు. వాట్సాప్ ద్వారా విటులను ఆకర్షించి, ఆన్ లైన్ లోనే పేమెంట్లను చేయించి.. జోరుగా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. మంగళవారం శ్రీనగర్ కాలనీలోని ఓ ఇంటిపై ఆకస్మికంగా దాడి చేసి నలుగురు విటులు, నిర్వాహకులను అరెస్టు చేయగా పోలీసుల విచారణలో వ్యభిచార దందాకు సంబంధించిన నిజాలు బయటకు వచ్చాయి. కర్ణాటక రాష్ట్రం, బళ్లారికి చెందిన ఇద్దరు మహిళలు స్వప్న, లక్ష్మి ప్రియ ఈ హైటెక్ వ్యభిచారం దందాకు సూత్రధారులుగా గుర్తించినట్లు సీఐ శివప్రసాద్ రెడ్డి తెలిపారు.

ఇందులో ఇద్దరు నిందితుల పేర్లు సాయిచరణ్, అనిరుధ్ కుమార్ లు. అందమైన యువతులు, అమ్మాయిల ఫొటోలను వాట్సాప్ లోనూ, ఇతర ఆన్ లైన్ మార్గాల ద్వారా విటులకు పంపుతున్నట్లు, విటుల ద్వారా వచ్చే అమౌంట్లను కూడా ఎవరికీ డౌట్ రాకుండా ఆన్ లైన్ పేమెంట్లను జరిపేలా చూస్తున్నారు. అలా సాయిచరణ్, అనిరుధ్ ద్వారా వచ్చిన విటులకు ఈ మొత్తం దందా నడిపిస్తున్న సూత్రధారులైన లక్ష్మిప్రియ, స్వప్నలు అందమైన అమ్మాయిలను చూపించి నచ్చిన వారితో వ్యభిచారం నిర్వహిస్తారు. ఇందుకోసం బెంగుళూరు, గుడివాడ సహా ఇతర ప్రాంతాల నుండి అందమైన అమ్మాయిలను తిరుపతికి రప్పించగా ఈ దందాపై పక్కా సమాచారం ఉండడంతో మంగళవారం రాత్రి వ్యభిచారం జరుగుతున్న ఇంటిపై దాడి చేసి నిందితులను పట్టుకుని వీరి నుంచి కొంతమంది యువతులను రక్షించినట్లు, దీనితో సంబంధమున్న మరో నలుగురిపై కూడా కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. ఇఈ వ్యవహారంపై విచారణ ఇంకా జరుగుతుంది అని వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •