టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

పంజాబ్ పోస్టల్ లో పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్!!

ఇండియా పోస్ట్ నుండి పంజాబ్ పోస్టల్ సర్కిల్ పలు రకాల పోస్టులను భర్తీ చేస్తోంది. పోస్టల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి పోస్టులు ఉన్నాయి. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టల్ అసిస్టెంట్ 45 పోస్టులు, సార్టింగ్ అసిస్టెంట్ 9 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మూడు పోస్టులు వున్నాయి.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం!
మొత్తం ఖాళీలు : 57
అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ: 18 ఆగస్టు
అర్హత వివరాలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి పన్నెండవ తరగతి పూర్తి చేసిన వాళ్ళు పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులు. ఇంకా అభ్యర్థులుకి గుర్తింపు పొందిన యూనివర్సిటీ బోర్డు లేదా ఇతర ఏ విధమైన బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి పదవ తరగతి పాస్ అయి ఉండాలి. అదే విధంగా ప్రాంతీయ భాష తెలిసి ఉండాలి. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు వయస్సు 18 నుండి 27 ఏళ్లు ఉండాలి.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 18 ఏళ్ల నుండి 25 ఏళ్లు ఉండాలి. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ కి 25,500 నుండి 81,100 వరకు ఇవ్వనున్నారు,. అదే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి అయితే 18 వేల రూపాయల నుండి 56,900 వరకు వస్తాయి. http://indiapost.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •