వార్తలు (News)

భారీ వర్షాలతో ముంబయి, థానెలో రెడ్ అలర్ట్‌!!

ముంబయి నగరాన్ని వానలు ముంచెత్తి ఎక్కడికక్కడ నీరు నిలిచి, రాకపోకలకు ఇబ్బంది తలెత్తుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబయి, థానె, పాల్ఘర్‌కు భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం కూడా వానలు తెరిపినిచ్చే సూచనలు కనిపించడం లేదని అంచనా వేసింది. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృశ్యాలు నెట్టింట్లో దర్శనమిస్తుండగా ఆదివారం నుంచి కురుస్తోన్న వానల కారణంగా.. ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని బీఎంసీ నగరవాసులకు సూచించింది. ఈ వర్షాల వల్ల చోటుచేసుకున్న పలు ఘటనల్లో ఇప్పటికే 33 మంది మరణించినట్టు సమాచారం.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •