వార్తలు (News)

కేరళలో వారాంతం లాక్ డౌన్!!

కేరళలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం శని, ఆదివారాల్లో (ఈ నెల 24,25 తేదీల్లో) పూర్తి లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. శుక్రవారం రోజు అదనంగా 3లక్షల పరీక్షలు చేయాలని, పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువ ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశిస్తూ, అన్ని జిల్లాల్లోనూ మైక్రో కంటెయిన్‌మెంట్‌ జోన్లను గుర్తించాలని కలెక్టర్లను కోరింది. కరోనా కేసులను నియంత్రించడమే లక్ష్యంగా నిబంధనలను కఠినతరం చేయాలని, కంటెయిన్‌మెంట్‌ జోన్లలో తక్షణమే రోజువారీ పరీక్షలను పెంచాలని సూచిస్తూ లాక్‌డౌన్‌ అమలు ఉన్న సమయంలో జూన్‌ 12, 13 తేదీల్లో జారీ చేసిన నిబంధనలే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టంచేసింది.

బక్రీద్‌ నేపథ్యంలో మూడు రోజుల పాటు సడలింపులు ఇవ్వడం వివాదాస్పదంగా మారడంతో జీవించే హక్కుపై శ్రద్ధ తీసుకోవాలని, కరోనా కేసులు పెరిగితే మాత్రం చర్యలు తప్పవని సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న కొవిడ్‌ ఆంక్షల్ని మరోవారం పాటు పొడిగిస్తున్నట్టు స్పష్టంచేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •