టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

వాట్సాప్ కొత్త ఫీచర్.. ఫోన్ బాటరీ డెడ్ అయినా వాడుకునే వెసలుబాటు??

వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌ తో ముందుకు రానుంది. ఫోన్‌ను ముట్టుకోకుండానే మెసేజ్ చేసుకునే వెసులుబాటు కల్పించేలా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం వాట్సాప్, యూజర్ ఫోన్‌తో లింక్ అయి ఉండి డెస్క్‌ టాప్, వెబ్ యాప్స్ లలో వాట్సాప్‌ను వినియోగించాలంటే కచ్చితంగా యూజర్ ఫోన్‌ను ఆ పరికరాలతో అనుసంధానించి ఉంచాలి.

అయితే కొత్త ఫీచర్ ప్రకారం ఫోన్ బ్యాటరీ డెడ్ అయిన సందర్భంలో కూడా యూజర్లు తమ ఫోన్ నుంచి సందేశాలు పంపించవచ్చు, మెసేజ్‌లను స్వీకరించవచ్చు. గరిష్టంగా ఒకేసారి 4 (టాబ్లెట్, పీసీలు) పరికరాలలో యూజర్లు తమ మెసేజింగ్ యాప్‌ను వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ బీటా వర్షన్‌గా కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుండగా దీని పని తీరును సమీక్షించి మరింత మెరుగు పరిచిన తర్వాత అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు వాట్సాప్ బృందం తెలిపింది. అంతే కాకుండా వాట్సాప్ కీలక సాంకేతికత అయిన ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కు కూడా ఈ కొత్త ఫీచర్‌కు అనుకూలంగా ఉంటుందని తెలుస్తుంది.

200 కోట్ల వాట్సాప్ ఖాతాదారులు చాలా కాలంగా ఈ ఫీచర్ కావాలంటూ యాజమాన్యానికి విజ్ఞ‌ప్తి చేస్తున్న నేపథ్యంలో ‘‘ప్రస్తుతం ఉన్న సాఫ్ట్‌వేర్ డిజైన్ యూజర్ స్మార్ట్ ఫోన్‌లో ఉన్న యాప్‌ను మాత్రమే ప్రైమరీ డివైస్‌గా పరిగణిస్తుంది. యూజర్ డేటా అంతటినీ ఈ ఫోన్‌ యాప్ ఆధారంగానే తీసుకుంటుంది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సౌకర్యం కూడా ఈ ఫోన్‌కు మాత్రమే వర్తింప చేస్తుంది’’ అని కంపెనీ పేర్కొంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •