వార్తలు (News)

13 అడుగుల గిరినాగు కలకలం!!

మామిడిపాలెంలో గిరిజనుల ఇళ్లల్లోకి 13 అడుగుల గిరినాగు (కింగ్‌కోబ్రా) చొరబడటంతో వారంతా భయభ్రాంతులతో పరుగులు తీశారు. విషయం తెలిసిన తర్వాత అడ్డతీగల అటవీ క్షేత్రంలో పని చేస్తున్న డీఆర్వో భానుప్రకాశ్, ఎఫ్‌బీఓలు ప్రశాంత్‌కుమార్, శశికుమార్‌లు కాకినాడకు చెందిన స్నేక్‌ శివను రప్పించారు. గ్రామానికి చెందిన యువకుడు కట్టా సిద్ధు తెలివిగా ఓ గోనె సంచిలోకి గిరినాగు వెళ్లేలా చేసి బంధించి దానిని మిట్లపాలెం సమీపాన తపస్వికొండ రక్షిత అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •