వార్తలు (News)

వర్షాలతో పైపైకి భూగర్భ జలాలు!!

జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు భూగర్భజలాల మట్టం ప్రస్తుతం 3.03 మీటర్లలోనే లభ్యమవుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో 3.70 మీటర్లకు పైనే భూగర్భ జలాలు ఉన్నాయి. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నుంచే జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో ఇది సాధ్యమైంది. వర్షపాతం కంటే 50 శాతం అధికంగా వర్షం కురిసింది. దీంతో భూగర్భ జలాల నీటిమట్టం గణనీయంగా పెరిగింది. జూన్‌లో భూగర్భ జలాల నీటి మట్టం 7.15 మీటర్లు ఉండగా ఇటీవల కురిసిన వర్షాలకు ఆగస్టు నెలలో 3.03 మీటర్ల నీటి మట్టం పెరిగింది.

జిల్లా వ్యాప్తంగా 392 చెరువులు పూర్తిస్థాయిలో నిండి అలుగు దూకి పారుతున్నాయి. అన్ని మండలాల్లోనూ సరాసరి నీటి మట్టాలు పై పైకి వచ్చాయి. బావుల్లో చేతికి అందే లోతులో నీళ్లు చేరడం గమనార్హం.

మండలాల వారీగా భూగర్భ నీటి మట్టాలు

ఆదిలాబాద్ 2.30
బజార్హత్నూర్ 0.08
బోత్ 3.50
గుడిహత్నూర్ 2.65

బేల 7.05
జైనథ్ 4.15
నేరడిగొండ 1.15
తలమడుగు 0.25
భీంపూర్ 3.20
తాంసి 3.18
నార్నూర్ 6.40
ఉట్నూర్ 1.15

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •