జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

రానున్న పది రోజుల్లో గ్రూప్1, గ్రూప్2 నోటిఫికేషన్ విడుదల అవకాశం!!

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ప్రభుత్వం జూన్ లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఏ ఇబ్బంది లేకుండా ఉండేందుకు జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసింది. ఈ నెల ఆగస్టు లో గ్రూప్-1, గ్రూప్-2 కి సంబంధించిన 36 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కానీ ఇంకా నోటిఫికేషన్ మాత్రం రాలేదు.

ఈ నేపథ్యంలో పది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేలా వుందని తెలుస్తుంది. అలానే దీనిలో 36 ఖాళీల్లో గ్రూప్-1 పోస్టులు 31, గ్రూప్-2 పోస్టులు ఐదు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే గ్రూప్-1 విభాగం లో చూసినట్లయితే బీసీ వెల్ఫేర్ ఆఫీసర్-2, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్)-7, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్-1, డిస్ట్రిక్ట్ రిజిస్టార్/అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్-2 ఉన్నాయి అని తెలుస్తోంది. రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్-2, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన 15 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు కూడా ఉన్నాయి. గ్రూప్ -2 కు సంబంధించి 5 సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 పోస్టులు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసినప్పటి నుండి కూడా పోస్టులని పెంచాలని అడుగుతున్నారు. పెంచుతారో లేదో చూడాలి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •