క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

అక్రమార్కులు కొత్త దందా.. రిజిస్ట్రేషన్‌ స్టాంప్‌ పేపర్స్‌ విక్రయాలు!!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రిజిస్ట్రేషన్‌ స్టాంప్‌ పేపర్ల కొరత సృష్టిస్తూ అక్రమార్కులు అడ్డదారులు తొక్కిస్తున్నారు. ఒక వైపు ప్రభుత్వం చాలీచాలని విధంగా స్టాంప్‌ పేపర్లు సరఫరా చేస్తుండటం, భారీగా రిజిస్ట్రేషన్‌లు పెరగడం వంటి పరిస్థితులను అదునుగా చేసుకుని కొంత మంది స్టాంప్‌ వెండర్లు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో నల్లబజారులో వారి వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో క్రయవిక్రయదారులు చేసేదేమీ లేక అదనపు డబ్బులు చెల్లించి స్టాంప్‌ పేపర్లు కొనుగోలు చేస్తున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొన్ని సబ్ రిజిష్టర్ కార్యాలయాల్లో స్టాంపు పేపర్ల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా రూ. 10 , 20, 50, 100 స్టాంప్ పేపర్ల కొరత అధికంగా ఉంది. ఈ పేపర్లను సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఓ కౌంటర్ ద్వారా స్టాంప్ పేపర్లు విక్రయించాల్సి ఉంది. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రత్యేక యాప్‌తో పాటు నగదు తీసుకుని కొద్దిమందికి మాత్రమే స్టాంప్ పేపర్లను అమ్ముతున్నట్లు సమాచారం. ఇదే అదునుగా భావించిన వారు 100 రూపాయల బాండ్ పేపర్‌ను మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను బట్టి రూ. 300 వరకు విక్రయిస్తూ అక్రమ దందాకు సాగిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •