టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

గచ్చిబౌలి టు శంషాబాద్‌ మధ్య పరుగులు పెట్టనున్న మినీ బస్సు!!

ప్రయాణికుల రద్దీ మేరకు గచ్చిబౌలి-శంషాబాద్‌ మార్గంలో తొలిసారిగా ఔటర్‌ రింగురోడ్డుపై మినీ బస్సులు ప్రవేశపెట్టారు. డిమాండ్‌కనుగుణంగా ఇతర మార్గాల్లోనూ బస్సుల విస్తరణకు గ్రేటర్‌ ఆర్టీసీ సన్నాహాలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. కొంతకాలంగా నగరంలో మెట్రో రైళ్ల నుంచి ఎదురవుతున్న పోటీ, కోవిడ్‌ దృష్ట్యా ప్రజా రవాణా రంగంలో నెలకొన్న స్తబ్దత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల డిమాండ్‌ ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు.

ఔటర్‌పై ప్రైవేట్‌ వాహనాల రాకపోకలు ఎక్కువ. దీంతో వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు కూడా ఈ వాహనాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వరకు తాజాగా మినీ బస్సులను ప్రవేశపెట్టింది. 30 సీట్ల సామర్ధ్యం ఉన్న ఈ బస్సులు రోజుకు 76 ట్రిప్పులు తిరుగుతాయి. ప్రతిరోజూ సుమారు 5 వేల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయం లభించనుంది. ఉదయం 7.30 నుంచి సాయంత్రం 7.45 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వరకు రూ.35 టికెట్‌ చార్జీ. కాగా ఈ బస్సులో ఎలాంటి పాస్ లకు అవకాశం లేదని అధికారులు అంటున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •