జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఎయిర్ ఫోర్స్ లో 282 ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్!!

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ లో 282 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కుక్, మెస్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్‌ 7వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను https://indianairforce.nic.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకుని అవసరమైన సర్టిఫికెట్లను జత చేసి ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరేలా పోస్టులో పంపించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభిస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •