జాతీయం (National) వార్తలు (News)

చమురు ధరలలో స్వల్ప తగ్గుదల??

గత నెలరోజుల నుండి స్థిరంగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గాయి. లీటర్‌ పెట్రోల్‌పై 14పైసలు, డీజిల్‌పై 18 పైసలు తగ్గించారు. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.69, డీజిల్‌ ధర రూ.97.15కు చేరింది.

ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి మొత్తం 41 సార్లు పెట్రో ధరల్ని పెంచిన విషయం అందరికీ తెలిసిందే! జులై 18 నుంచి చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.11.44, డీజిల్‌ ధర రూ.8.74 మేర పెరిగాయి.

వివిధ నగరాల్లో పెట్రోల్‌ ధరలు ఇలా ఉన్నాయి. (లీటర్‌ ధర రూ.లలో)

నగరం పెట్రోల్‌  డీజిల్‌
హైదరాబాద్‌ 105.6997.15
దిల్లీ101.6489.07
కోల్‌కతా101.9392.13
ముంబయి107.6696.64
బెంగళూరు105.1394.49
లఖ్‌నవూ98.789.45
చెన్నై    99.3293.66
close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    189
    Shares
  • 189
  •  
  •  
  •  
  •