అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

ఆఫ్ఘన్ లో మైనార్టీలపై అరాచకత్వం మొదలు??

అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ అరాచకత్వాన్ని కొనసాగిస్తూ మహిళల హక్కులను కాలరాస్తున్నారు. జర్నలిస్టులు, తమకు ఎదురుతిరిగే వారిని అణగ దొక్కుతున్నారు. తాజాగా అక్కడి మైనార్టీలపైనా (ప్రత్యేకంగా ఓ మతానికి చెందిన వారిపై) అరాచకాన్ని ప్రదర్శిస్తున్నారని వారిని బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు అమెరికా కాంగ్రెస్ మాజీ సభ్యుడు మార్క్ వాకర్ ఆరోపించారు. అమెరికాలోని హోస్ట్ టాడ్ స్టార్న్స్‌ అనే రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్క్‌ మాట్లాడుతూ అఫ్గాన్‌లోని మైనారిటీల పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

అఫ్గానిస్థాన్‌లో కొనసాగుతున్న మైనార్టీకి చెందిన ఓ వ్యక్తిని బంధించి చిత్రహింసలు పెట్టి హతమార్చినట్లు పేర్కొన్నారు. అనంతరం అతడిని బహిరంగంగా స్తంభానికి వేలాడదీసినట్లు వెల్లడించారు. మార్క్‌ మాటలను బట్టి మున్ముందు తాలిబన్ల పాలన ఎంత దారుణంగా ఉంటుందో ప్రపంచ దేశాలు ఒక అంచనాకు వచ్చేసాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •