క్రైమ్ (Crime) వార్తలు (News)

గ్లూ ట్రాప్‌లపై నిషేధం విధించిన తెలంగాణ ప్రభుత్వం??

ఇంట్లో ఎలుకలు తిరుగుతుంటే జిగురుతో ఉండే ప్యాడ్స్‌ (గ్లూట్రాప్‌) ఉపయోగించడం ఈమధ్య సాధారణమైపోయింది. గ్లూట్రాప్స్‌తో ఎలుకలను బంధించడం అత్యంత క్రూరమైన విధానమని, ఎలుకలు వాటికి అతుక్కుపోయి తీవ్రనొప్పి, బాధను ఎదుర్కొంటాయని.. గ్లూట్రాప్‌ల వినియోగం జంతువులపై క్రూరత్వం నిషేధ చట్టం- 1960లోని సెక్షన్‌ 11 స్ఫూర్తికి విరుద్ధమని ‘పీపుల్‌ ఫర్‌ ది ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనిమల్స్‌’ (పెటా) తెలంగాణ ప్రభుత్వానికి ఇటీవల విజ్ఞప్తి చేసింది. దీంతో ఈ విషయంపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ఈ గ్లూట్రాప్‌ల వినియోగాన్ని నిషేదించింది. దీంతో రాష్ట్ర పశుసంవర్థకశాఖ ప్రత్యేక సర్క్యులర్‌ జారీ చేసి నిషేధాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇతర సంప్రదాయ పద్ధతుల్లో ఎలుకల నియంత్రణకు చర్యలు తీసుకోవచ్చని పెటా ఇండియా ప్రజలకు సూచించింది. ఇక గ్లూట్రాప్‌లను నిషేధిస్తూ ప్రభుత్వం ప్రకటించడంపై ‘పెటా’ హర్షం వ్యక్తం చేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •