క్రైమ్ (Crime) వార్తలు (News)

వివేకా హత్య కేసులో ట్విస్ట్??

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటికే సీబీఐ సాగించిన సుదీర్ఘ విచారణతో ఒక నిందితులను గుర్తించినట్లేనని అందరూ భావించారు. హత్య జరిగిన ప్రాంతం నుంచి అనేక మంది అనుమానితులను సీబీఐ విచారించింది. వివేకా కుమార్తె సునీత ఇచ్చిన ఫిర్యాదు -అనుమానితుల జాబితా ఆధారంగా సీబీఐ విచారణ సాగించి తాము గమనించిన అనేక అంశాల్లోనూ లోతుగా సమాచారం సేకరించింది. హత్య జరిగిన వివేకా నివాసంలో ఆధారాలను సేకరించింది.

ఆ తరువాత ఆయన వద్ద పని చేసే సిబ్బందితో మొదలైన విచారణ తాజాగా వైఎస్ కుటుంబ సభ్యుల దాకా కొనసాగింది. కొద్ది రోజుల క్రితం సునీల్ యాదవ్ అనే వ్యక్తిని గోవాలో అదుపులోకి తీసుకున్న సీబీఐ ఆయన్ను కోర్టు అనుమతితో విచారణ కోసం అదుపులోకి తీసుకుంది. ఆ సమయంలో పులివెందుల లో ఒక కాలువలో వివేకా హత్యకు సంబంధిచి ఉపయోగించిన ఆయుధాల కోసం అన్వేషించారు. కానీ, అక్కడ ఫలితం రాలేదు. అయితే, సీబీఐ అనుమానిస్తున్న వారి నివాసాల్లోనే హత్యా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రచారం సాగింది.

సీబీఐ ఆ ప్రకటనలో 2019 మార్చి 14-15 అర్ద్రరాత్రి సమయంలో ఆయన నివాసంలోనే దారుణంగా హత్యకు గురయ్యారని..దీనికి సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు జూలై 9, 2020 నుంచి సీబీఐ ఈ కేసు విచారణ ప్రారంభించిందని వివరించారు. ఈ కేసుకు సంబంధించి నమ్మకమైన సమాచారం అందించిన వారికి రూ 5 లక్షలు నజరానాగా అందిస్తామంటూ సీబీఐ ప్రకటనలో పేర్కొంది. హత్య నిందితుల ఆచూకీ కోసం ఈ ప్రకటన జారీ చేసింది.

ఈ ప్రకటన ఇప్పుడు రాజకీయంగానూ చర్చకు కారణమైంది. వివేకా హత్య కేసుకు సంబంధించి రాజకీయంగానూ పలు ఆరోపణలు – విమర్శలకు కారణమైంది. అయితే, తాజా సీబీఐ పత్రికా ప్రకటనతో మొత్తం వ్యవహారం మరో మలుపు తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. దీని పై సీబీఐ మరింత స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పడు ఈ వ్యవహారం పైన రాజకీయంగా చర్చకు దారి తీయనుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •