రాజకీయం (Politics) వార్తలు (News)

కరోనా, డీజిల్‌ ధరల వల్లే ఆర్టీసీ దెబ్బతిన్నది: కేసీఆర్‌!!

టీఎస్‌ఆర్టీసీని గట్టెక్కించడం కోసం రెండేళ్ల క్రితమే పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. గాడిలో పడుతున్న దశలో కరోనా, డీజిల్‌ ధరలు ఆర్టీసీని మరింత దెబ్బతీశాయని, ఆర్టీసీ తిరిగి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఆర్టీసీని తిరిగి నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. టీఎస్ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కరోనా ప్రభావంపై సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. ఆర్టీసీపై పెరిగిన డీజిల్‌ రేట్ల భారంపై సమవేశంలో చర్చించి ఆర్టీసీ తిరిగి పుంచుకునేందుకు కార్యాచరణపై సీఎం సమీక్షించారు. మంత్రులు పువ్వాడ అజయ్, కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌, ఎండీ, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

ఆర్టీసీపై ఏటా రూ.500 కోట్ల భారం పడుతోందని, లాక్‌డౌన్‌తో ఆర్టీసీ రూ.3 వేల కోట్ల ఆదాయం కోల్పోయిందని అధికారులు సీఎంకు వివరించారు. మొత్తంగా 97 డిపోలు నష్టాల్లోనే ఉన్నాయని, ఆర్టీసీ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి నెలకొందన్నారు. 2020 మార్చిలో ఛార్జీలు పెంచుతామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఛార్జీలు పెంచలేదని, ఛార్జీలు పెంచేందుకు అనుమతిస్తే తప్ప ఆర్టీసీకి మనుగడ లేదని అధికారులు వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •