జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఐటిలో భారీగా ఉద్యోగ నియమాకాలు!!

కోవిడ్‌ రాకతో ఐటీ సంస్థల్లో నెలకొన్న అనిశ్చితితో చాలా వరకు కంపెనీలు ఉద్యోగులను తీసివేయడంతో పలు వ్యాపార కార్యకలాపాలు కూడా గణనీయంగా పడిపోయాయి. అయితే ఇప్పుడిప్పుడే కోవిడ్‌ నుంచి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకుంటున్నాయి. దాంతో పాటు పలు మల్టీనేషనల్‌ కంపెనీలు కూడా భారీగా ఉద్యోగ నియమాకాలను చేపడుతున్నాయి. తాజాగా డెలాయిట్‌ చేపట్టిన సర్వే ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ను చెప్తుంది.

ఇప్పటికే పలు ఐటీ కంపెనీల్లో పనిచేస్తోన్న ఉద్యోగులకు వచ్చే ఏడాది 2022లో సుమారు 8.6 శాతం వరకు ఉద్యోగుల జీతాలు పెరుగుతాయని డెలాయిట్‌ తన సర్వేలో వెల్లడించింది. 2022 నాటికి పలు సంస్థలు రెండంకెల వృద్ధిని సాధిస్తాయని డెలాయిట్‌ సర్వే పేర్కొంది. కంపెనీలోని టాప్‌ పర్ఫార్మర్స్‌కు సగటు ఉద్యోగుల కంటే 1.8 రెట్లు ఎక్కువ వేతనాలు పొందుతారని డెలాయిట్‌ తన సర్వేలో పేర్కొంది. ఈ ఏడాదిలో ఐటీ కంపెనీల్లో సుమారు 12 శాతం ఉద్యోగులకు ప్రమోషన్స్‌ను పొందారు. 2020లో ఇది 10 శాతంగానే ఉంది. దేశవ్యాప్తంగా ఐటీ కంపెనీలు సుమారు 78 శాతం మేర నియామకాలను చేపడుతున్నాయి. రిటైల్‌, హాస్పిటాలిటీ, రెస్టారెంట్లు, మౌలిక, రియాలీటీ రంగంలో వేతనాల పెంపు ఉండక్కపోవచ్చునని డెలాయిట్‌ అభిప్రాయపడింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •