జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

త్వరలో సింగరేణిలో క్లరికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!!

సింగరేణి సంస్థలో త్వరలో 177 క్లరికల్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ త్వరలో వెలువడనుంది. సోమవారం కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్‌ బలరాం మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి అక్రమాలు, ఆరోపణలకు తావులేకుండా రాత పరీక్షను పారదర్శకంగా నిర్వహిస్తామని, ఎవరి మాటలు నమ్మి మోసపోవద్దని.. సింగరేణిలో ఉద్యోగాల భర్తీను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా బలరాం పలు విషయాలపై మాట్లాడారు. గతేడాది సింగరేణి సంస్థ సాధించిన నికర లాభం వివరాలను ఈ నెల 25న నిర్వహించనున్న బోర్డు సమావేశంలో ప్రకటించే అవకాశముందని, లాభాల్లో కార్మికుల వాటా విషయమై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు, సంస్థ సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ దసరా లోపు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. తమ నుంచి బొగ్గు కొనుగోలు చేసిన వారు వారంలోగా బకాయిలను చెల్లించకపొతే ఏడున్నర శాతం వడ్డీ విధిస్తామంటూ స్పష్టంచేశారు. ఈ రూపంలో సంస్థకు ఏటా రూ.100 కోట్లు అదనంగా లభిస్తుందని బలరాం వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •