అంతర్జాతీయం (International) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ నివసించిన గృహం అమ్మకానికి సిద్దం!

నోబెల్‌ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ లండన్‌లో కొంత కాలం పాటు నివసించిన సంగతి అందరికి తెలిసిందే! అయితే ఇప్పుడు తాజాగా ఆ గృహం అమ్మకానికి వచ్చింది. 1912లో ఠాగూర్‌ గీతాంజలిని ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేస్తున్న సమయంలో హాంపస్టెడ్‌ హీత్‌లోని హీత్‌ విల్లాలో నివసించారు. అప్పటి నుంచి ఈ విల్లాకు ప్రాముఖ్యత పెరిగింది. 2015, 17లలో బెంగాల్‌ సీఎం మమత యూకేను సందర్శించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ విల్లాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తూ లండన్‌లోని భారత హై కమిషన్‌తో ఆమె అప్పట్లో ఈ విషయంపై మాట్లాడారు.

ఠాగూర్‌ నివసించిన ఆ ఇంటిని ఒక మ్యూజియంగా మార్చాలని ఆమె ప్రయత్నించారు. ఎస్టేట్‌ ఏజెంట్‌ ఫిలిప్‌ గ్రీన్‌ మాట్లాడుతూ తమ కస్టమర్లు అత్యధిక విలువను పొందడమే లక్ష్యమని, బ్రిటిష్‌ చట్టాలను అనుగుణంగా కొనుగోలు చేస్తే తమకు సమస్యేమీ లేదని తెలుపాగా ప్రస్తుతం ఈ విల్లా కొనుగోలుపై బెంగాల్‌ ప్రభుత్వంగానీ, కేంద్రంగానీ ఎలాంటి ఆసక్తి వ్యక్తం చేయలేదని లండన్‌లో భారత హైకమిషన్‌ తెలిపింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    29
    Shares
  • 29
  •  
  •  
  •  
  •