దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12 లక్షలకు పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 6,317 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.47 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 318 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4.78లక్షలకు చేరింది. గత 24 గంటల్లో 6,906 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3.42 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 78,190గా ఉంది.