గురుకుల టీజీటీ పోస్టుల విషయంలో రాష్ట్ర హై కోర్టు సంచలన తీర్పును ఇస్తూ గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్ విద్యార్థులు అర్హులే అని వ్యాఖ్యానించింది. గత కొద్ది రోజులుగా గురుకుల టీజీటీ పోస్టుల భర్తీ లో బీటెక్ అభ్యర్థుల అర్హత పై వివాదం నెలకొన్న విషయం అందరికి తెలిసిందే. తాజా గా దీని పై హై కోర్టు బీఈడీ చేసిన బీటెక్ అభ్యర్థులను గురుకుల టీజీటీ పోస్టులకు అర్హులే అని తెల్చి చెప్పి ఈ వివాదానికి స్వస్తి పలికింది.

ఇక గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అప్పిళ్లను అన్నింటినీ హై కోర్టు కొట్టివేస్తూ బీఈడీ చేసిన బీటెక్ అభర్థులను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా నాలుగు వారాల్లో నియామకాలు చేపట్టాలని కూడా హై కోర్టు ఆదేశించింది.