ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా తమదైన వ్యూహాలతో ముందుకు సాగాలని రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈ సారి దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం సాధించి చరిత్ర సృష్టించడమే లక్ష్యంగా కోహ్లీసేన ముందడుగు వేస్తుంది. డిసెంబర్ 26వ తేదీన సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికా భారత్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో ఎవరు ఎలా రాణించ బోతున్నారు అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమయ్యింది.

ప్రస్తుతం ఈ టెస్టు సిరీస్లో అటు జస్ప్రిత్ బూమ్రా స్పెషల్ ఎట్రాక్షన్ గా మారి పోయాడు. ఇప్పటికే ఎన్నోసార్లు తన బౌలింగ్లో అద్భుతాలు సృష్టించి టీమిండియాకు విజయాలు అందించిన జస్ప్రిత్ బూమ్రా ఇక ఇప్పుడు టీమిండియా టెస్టు సిరీస్ గెలవడం లో కూడా కీలక పాత్ర వహిస్తాడు అని అందరూ నమ్ముతున్నారు. ఇలాంటి సమయంలోనే తమకు జస్ప్రిత్ బూమ్రా తో ప్రమాదం పొంచి ఉంది అంటూ దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పై ప్రశంసలు కురిపించాడు.

భారత జట్టులో జస్ప్రిత్ బూమ్రా ఒక ప్రపంచ స్థాయి బౌలర్, అతనితోనే దక్షిణాఫ్రికా జట్టుకు ప్రమాదం ఉంది. ప్రస్తుతం భారత బౌలింగ్ విభాగం ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే తమ జట్టు కేవలం జస్ప్రిత్ బూమ్రా మీదనే కాకుండా మిగతా బౌలర్లపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టుతో పోల్చుకుంటే టీమిండియా జట్టు కాస్త మెరుగ్గా ఉంది. ఈ కారణంతోనే కొత్త ఆటగాళ్లను తీసుకుని, యువ ఆటగాళ్లతోనే మీడియా ను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాము అంటూ దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ డీన్ ఎల్గార్ చెప్పారు.