ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పలు ఖాళీల భర్తీకి నోటిఫికేసన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ రంగానికి చెందిన ఈ సంస్థ గ్రూప్‌ సీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల తాలూకు పూర్తి వివరాలు చూడండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు :

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 05 గ్రూప్‌ సీ సివిలియన్‌ ఖాళీలు భర్తీ చేయనున్నారు. వీటిలో కుక్‌ (ఓజీ) పోస్టులు ఉన్నాయి. ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఏఎఫ్‌ స్టేషన్‌ బీదర్‌లో రెండు పోస్టులు, కమాండెంట్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ హైదరాబాద్‌లో మూడు ఖాళీలు ఉన్నాయి. పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మెట్రిక్యులేషన్‌/ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. అంతేకాకుండా సంబంధిత ట్రేడులో కనీసం ఏడాది అనుభవం ఉన్న అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు : ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్ ఏఎఫ్‌ స్టేషన్‌ బీదర్‌, కమాండెంట్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ హైదరాబాద్‌ అడ్రస్‌కు పంపించాలి. అభ్యర్థులను స్క్రూటినీ, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.