ఒక 68 సంవత్సరాల మహిళ ఎర్ర కోట తన కుటుంబ ఆస్తి అని చెప్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ ఆ పిటిషన్ ను ‘స్థూల సమయం వృధా’గా పేర్కొంది. దానికి తోడు తాను గత మొఘల్ చక్రవర్తి బహదూర్ షా-2 మునిమనవడి భార్యనని, తనకు న్యాయం చేస్తూ ‘ఎర్ర కోట’ను అప్పజెప్పాలని పిటిషన్‌లో కోరింది. అంతేకాకుండా తనకు సంబంధించిన ఆస్తిని స్వాధీనం చేసుకున్నందుకుగాను ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఎర్రకోట విషయంలో 170 ఏళ్ల జాప్యం ఎందుకు జరిగిందని ప్రశ్నించింది. మీ ప్రకారం మీకు 1857లో అన్యాయం జరిగిందని, మరి ఇన్నాళ్లు మీరు ఎందుకు కోర్టును ఆశ్రయించలేదన్నది తెలపాలని కోర్టు కోరుతూ తుదకు ఆ పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.