ఉపకారవేతనాలు, వివిధ పథకాలకు సంబంధించి బీసీ విద్యార్థులకు విధించిన కుటుంబ ఆదాయ పరిమితిని తెలంగాణ ప్రభుత్వం పెంచుతూ సోమవారం ఉత్తర్వులను జారీచేసింది. ప్రస్తుతం పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లను పొందేందుకు ఓబీసీ విద్యార్థులకు సంబంధించి వారి కుటుంబ ఆదాయం రూ.1.50లక్షలు ఉండగా, ఆ మొత్తాన్ని రూ. 2.50 లక్షలకు ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈబీసీ విద్యార్థులకు అందజేసే అంబేద్కర్‌ పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి కుటుంబ ఆదాయ పరిమితిని కూడా రూ.1లక్ష నుంచి రూ.2.50 లక్షలకు ప్రభుత్వం పెంచింది. డీనోటిఫైడ్‌ నొమాడిక్‌, సెమినొమాడిక్‌ ట్రైబ్స్‌కు అందజేస్తున్న అంబేద్కర్‌ ప్రీ, పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లకు ఉన్న కుటుంబ ఆదాయ పరిమితిని రూ.2.50లక్షలకు పెంచింది.