ప్రముఖ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ కీలక నిర్ణయం తీసుకుంటూ మార్కెట్‌లోకి ఇటీవల విడుదల చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్-350 మోడల్ బైకుల్లో సాంకేతిక లోపం ఉన్నందున వాటిని రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మోడల్ బైక్ వెనుక భాగంలోని బ్రేకుల్లో సమస్య ఉన్నట్లు కంపెనీ సాంకేతిక విభాగం గుర్తించడంతోనే 26,300 బైకులను వెనక్కి పిలిపిస్తున్నట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ వెల్లడించింది

క్లాసిక్-250 మోడల్ బైకుల్లో బ్రేక్ పెడల్‌ను గట్టిగా నొక్కితే రెస్పాన్స్ బ్రాకెట్‌పై ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని, దీంతో ఆ సమస్య బ్రేకు సామర్థ్యాన్ని దెబ్బ తీస్తున్నట్లు కంపెనీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు విశ్లేషించారని పేర్కొంది. ఈ మేరకు సర్వీస్ బృందాలు, లోకల్ డీలర్లు వాహన గుర్తింపు సంఖ్యల ఆధారంగా వాహన యజమానులకు రీకాల్ సమాచారం అందించి సమస్యను పరిష్కరిస్తారని రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ప్రకటించింది.