ఈమధ్య కాలంలో లింగ వివక్ష లేకుండా దాదాపు చాలామందికి అతి చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య ఎదురవుతుంది. కొందరైతే తెల్ల జుట్టు సమస్య వల్ల డిప్రెషన్ కు కూడా గురవుతుంటారు. వయసు పెరిగే కొద్ది తెల్ల జుట్టు రావడం సర్వ సాధారణం. కానీ, యుక్త వయసులోనే జుట్టు తెల్లబడుతుందంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అదే సమయంలో తెల్లు జుట్టును నల్లగా మార్చుకునేందుకు కూడా చాలా పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బాదం నూనెలో ఇప్పుడు చెప్పబోయేవి కలిపి రాస్తే.. మీ తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది. ముందుగా ఒక బౌల్‌లో బాదం నూనె తీసుకుని అందులో నువ్వుల పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు, కేశాలకు బాగా పట్టించి అర గంట పాటు ఆరనివ్వాలి. అనంతరం గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు నల్లగా మారె అవకాశం ఉంటుంది.

గోరింటాకు ఆకులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక బౌల్‌లో వేసి నీరు పోసి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత బాదం ఆయిల్ వేసి.. స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమం చల్లారాక జుట్టుకు అప్లై చేయాలి. ఒక గంట పాటు వదిలేసి.. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేసినా మంచి ఫలితంగా ఉంటుంది.

ఒక బౌల్ తీసుకుని అందులో బాదం నూనె, ఆముదం, మరియు ఎగ్ వైట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు, కేశాలకు మరియు కుదళ్లకు బాగా పట్టించి.. గంట పాటు ఆరిన అనంతరం గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఇలా చేసినా తెల్లజుట్టు క్రమేపి నల్లబడే అవకాశం ఉంది.