దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. నేటి ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 363 పాయింట్ల లాభంతో 56,682 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 109 పాయింట్లు లాభపడి 16,880 వద్ద ట్రేడవుతున్నాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, రిలయన్స్‌, ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మారుతీ, ఎల్‌ అండ్‌ టీ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, ఇక పవర్‌గ్రిడ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, విప్రో, నెస్లే ఇండియా షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.