దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు కూడా లాభాల్లోనే ముగిసాయి. ఉదయం సెన్సెక్స్‌ 56,599.47 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమై రోజంతా అదే ఒరవడి కొనసాగించింది. ఇంట్రాడేలో 56,989.01 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరకు 611.55 పాయింట్ల లాభంతో 56,930.56 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 16,865.55 పాయింట్ల వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 16,971.00 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరకు 184.60 పాయింట్లు లాభపడి 16,955.45 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ 30 జాబితాలో నేడు బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్ టెల్, సన్ ఫార్మా, రిలయన్స్, ఎస్ బిఐ, ఎల్ అండ్ టి షేర్లు లాభాలో ముగిసాయి. ఐ టీ సి, విప్రో, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ముగిసాయి.