జిల్లాలో 281 యాక్టివ్​కేసులు ఉండగా,నాలుగైదు రోజుల్లోనే 48మందికి సోకింది.ఒకే గ్రామంలో 33 మందికి పాజిటివ్గ తేల్చారు.టెస్టుల సంఖ్య ఆఫీసర్లు పెంచారు
మెట్​పల్లిలోని ఓ బ్యాంక్​ స్టాఫ్​కు ​కరోనా సోకగా ఆ బ్రాంచ్ ​క్లోజ్ చేసారు.

కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామంలో ఇటీవల ఓ వ్యక్తి మృతిచెందారు. అతని అంత్యక్రియల్లో చాలామంది పాల్గొన్నారు. రెండు రోజుల తరవాత  అంత్యక్రియల్లో పాల్గొన్న వ్యక్తి ఒకరికి కరోనా లక్షణాలు రావడంతో అనుమానంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఆరోగ్య శాఖ గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేసింది. అంత్యక్రియల్లో పాల్గొన్న అందరికీ పరీక్షలు చేశారు. మొత్తం 33 మందికి పాజిటివ్ అని తేలింది. కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ లోనూ అనుమానం వచ్చి కరోనా పరీక్షలు
నిర్వహించగా ముగ్గురికి  పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.