నిత్యావసర ధరల పెరుగుదలపై స్పందిస్తూ ముద్రగడ ప్రధాని మోడీ కి ఒక లేఖ రాసారు.నిత్యవసర వస్తువుల ధరలు పెంపుదల తో ప్రజలు అల్లాడిపోతున్నారు.నిత్యవసర వస్తువుల ధరలు ఇష్టానుసారంగా పెంపుదల చేయడం వలన ప్రజలంతా తట్టుకోలేక అల్లాడిపోతున్నారు అని దీనిపై తక్షణమే చర్యలు తీసుకుని ప్రజలకు భరోసా ఇవ్వాలని మాజీ మంత్రి ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి లేఖ రాశారు… ఈ సందర్భంగా గా లేఖ ద్వారా మాట్లాడుతూ
పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ ప్రభావంతో నిత్యావసరాల ధరలు పెరిగి పేద, మధ్య తరగతి వారి జీవన ప్రమాణాలు తగ్గిపోతూ వస్తున్నాయి. ఇది అన్యాయమని ప్రజలు గోల పెడుతుంటే ఈ పెరుగుదలకు కారణం గత ప్రభుత్వాల పాపమే అని తమరు చెన్నైలో చెప్పడం మీడియా ద్వారా తెలిసింది. అని ప్రధాని కి ముద్రగడ తెలిపారు.
ప్రజల కష్టాలు తీరుస్తారని, వారి జీవితాలకు వెలుగు ఇస్తారని తమరికి రెండవ దఫా కూడా అధికారం ఇచ్చి సుమారు 7 సం||లు అయ్యింది. కాని ధరలు పెరుగుదలకు గత ప్రభుత్వాలే కారణం అని చెప్పి తప్పించుకోవడం మీలాంటి వారికి తగదని నా అభిప్రాయం. అని ముద్రగడ అన్నారు.
వాహనాలకు మోటారు వెహికిల్ టాక్స్ పేరుతో లక్షలాది రూపాయలు ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి మరియు టోల్ గేట్లు 30 సం||లు లీజుకు ఇచ్చి తోలు తీసే ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు. దానికి తోడు డీజిలు, పెట్రోలు ధరలు పెంచుకుంటూ పోతున్నారు. ఈ మద్య ఫాస్టాగ్ తీసుకోమని తప్పని సరి చేసారు. దీనివల్ల వాహనదారులకు ఉపయోగం ఏమిటి? అని అని ప్రధాని ముద్రగడ ప్రశ్నించారు.
మిమ్మలను నమ్ముకున్న బడా కంపెనీల వారి అభివృద్ధి కోసం తరచూ ఆలోచన చేయడం కాదండి, ఓట్లు వేసిన ప్రజల కోసం ఆలోచన చేయండి. మాటమాటకు గతం అని సంభోదించడం మంచిగా లేదండి. గత ప్రభుత్వాలు తప్పులు చేసారు కాబట్టే మీకు అధికారం ఇచ్చారు. వారికిలాగ చేయమని కాదండి. అని ముద్రగడ సున్నితంగా సూచించారు.
ప్రజలు సమస్యలు కోసం రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి మనదేశంలో లేదండి, అయినా అటువంటి పరిస్థితి మీపాలనలో తెచ్చుకోకండి. దయచేసి సమీక్ష చేసి ప్రజలు యొక్క సంపాదన ప్రభుత్వాలకు పూర్తిగా దఖలు పడే నిర్ణయాలు మార్పుచేయమని కోరుచున్నానండి. అంటూ ప్రధాని నరేంద్ర మోడీ కి మాజీమంత్రి ముద్రగడ లేఖ రాశారు.