ఎయిర్‌‌‌‌టెల్‌‌ సిమ్‌‌ అప్‌‌డేట్‌‌ చేసుకోవాలంటూ సైబర్ క్రిమినల్ ఓ యువతి దగ్గరి నుంచి రూ.98 వేలు కొట్టేశాడు. ఎస్‌‌ఆర్‌‌‌‌ నగర్‌‌‌‌లోని రాజీవ్‌‌నగర్‌‌‌‌కి చెందిన వాణికి రెండ్రోజుల క్రితం ఎయిర్‌‌‌‌టెల్ కస్టమర్ కేర్‌‌‌‌ పేరుతో ఫోన్ కాల్ వచ్చింది. సిమ్ నంబర్ అప్‌‌డేట్‌‌ చేసుకోవాలని,  లేదంటే డీయాక్టివేట్‌‌ అవుతుందని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు.  అప్‌‌డేట్ కోసం ఎనీ డెస్క్ యాప్‌‌ డౌన్‌‌ లోడ్ చేసుకోవాలన్నాడు. తర్వాత నెట్‌‌బ్యాంకింగ్‌‌తో రూ.98 వేలు ట్రాన్స్‌‌ఫర్ చేసుకున్నాడు. బ్యాంక్‌‌ అకౌంట్‌‌ నుంచి మెసేజ్ రావడంతో వాణి అలర్ట్‌‌ అయ్యింది. బ్యాంక్‌‌కి వెళ్ళి చెక్‌‌ చేసుకుంది. సైబర్ ఫ్రాడ్‌‌ జరిగినట్లు గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది.