వార్తలు (News)

వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్దనున్న స్మారక చిహ్నం – విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ తెన్నేటి విశ్వనాధం నడిపిన ఉద్యమ ఫలితంగా, అప్పటి దేశ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ 1970 ఏప్రిల్ 10 విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పనున్నట్లు పార్లమెంటులో ప్రకటించింది. కర్మాగారం కోసం కురుపాం జమీందారులు 6000 ఎకరాలను 1970లో దానం చేసారు. 1970 జూన్ లో ఏర్పాటు చేసిన స్ఠల పరిశీలన కమిటీతో కర్మాగారాపు ప్రణాళికలు మొదలయ్యాయి. 1971 జనవరి 20న శ్రీమతి ఇందిరా గాంధీచేత కర్మాగారం యొక్క శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.1971 ఫిబ్రవరిలో సలహాదారులు నియమింపబడ్డారు. 1972 లో సాధ్యాసాధ్య నివేదిక (feasibility report) ప్రభుత్వానికి సమర్పంపబడింది. 1974 ఏప్రిల్ 7న మొదటి దశ స్థల సేకరణ జరిగింది. 1975 ఏప్రిల్ నెలలో సమగ్ర నివేదిక సమర్పంచేందుకు M/s M.N.దస్తూర్ & కోని సలహాదారుగా ఏర్పాటు చేయగా, 3.4 ఎం.టి.పి.ఏ ద్రవ ఉక్కు తయారీ సామర్థ్యత గల కర్మాగార ఏర్పాటుకై ప్రతిపాదనలు 1977 అక్టోబరులో ప్రభుత్వానికి చేరాయి. పూర్వ సంయుక్త రష్యా సహకారంతో నివేదికలో అనేక మార్పులు చేర్పులు జరిగాయి. 1980 నవంబరులో M/s M.N.దస్తూర్ & కో సమగ్ర నివేదికని సమర్పించింది. కోక్ ఒవెన్, సెగ కొలిమి, సింటర్ ప్లాంట్ల రూపకల్పనకై పూర్వపు రష్యా దేశంతో 1981 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరింది. 1982 జనవరిలో సెగ కొలిమి నిర్మాణానికి, ఉద్యోగస్ఠుల పట్టణానికి శంకుస్థాపన జరిగింది.

1982 ఫిబ్రవరిలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (RINL) ఏర్పడింది. 1982 ఏప్రిల్ నెలలో వైజాగ్ స్టీల్, భారతీయ ఉక్కు సంస్థ (SAIL) ఉండి విడివడి RINL గా గుర్తింపు పొందినది.

33వేల ఎకరాలలో విస్తరించి ఉన్న వైజాగ్ స్టీల్, భారతదేశంలో తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం. 3.6 MTగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3MTకి పెంచే రూ. 8,692కోట్ల విస్తరణ ప్రాజెక్టుని దేశ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ 2009 మే 29న ప్రారంభించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.