జీతాలు పెంచాలని ఆందోళన చేస్తున్న వలంటీర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో పడింది ఏపీ సర్కార్. ఉగాది నాడు సేవారత్నా , సేవామిత్ర పేరుతో ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. మరోవైపు పాలనను మెరుగుపరిచేందుకు ఐక్య రాజ్య సమితి నిర్ధేశించిన 17 సూత్రాలు అమలుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించే పనిలో పడింది.

జగన్ పాలనా పగ్గాలు చెప్పటిన తర్వాత తీసుకున్న కీలక విధానపరమైన నిర్ణయాలలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఒకటి. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షల మంది పనిచేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో వాలంటీర్ల రోడ్డెక్కారు. తమ పై పని ఒత్తిడి పెరిగిందని, జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పద్ధకలను ప్రజల గుమ్మంవారకు చేరుస్తున్న వాలంటర్ వ్యవస్థ ఆంధోళనకు దిగడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీంతో సీఎం జగన్ వాలంటీర్లకు బహిరంగ లేఖ రాశారు. వాలంటీర్లది ఉద్యోగం కాదని అది సేవాని చెప్పారు.

సోమవారం జరిగన ప్రణాళిక శాఖ సమీక్షలో జగన్ కీలక నిర్ణయం ప్రకటించారు. ప్రతీ ఏడాది ఉగాది రోజు కొంత మంది గ్రామ సచివాలయ వాలంటీర్లకు పనితీరు ఆధారంగా ఎంపిక చేసి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. బెస్ట్ వాలంటీర్లకు నగదు బహుమతితో పాటు, సత్కరించాలని నిర్ణయించారు. ఈ మేరకు తగిన కార్యాచరణ సిద్దం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. jనియోజకవర్గాల వారీగా తర్వాత జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేయాలని సూచించారు. ఈ సత్కారాలకు సేవామిత్ర, సేవారత్నా లాంటి పేర్లను పరిశీలించినట్లు తెలుస్తుంది.

మరోవైపు ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలపై దృష్టిక సారించాలని అధకారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. గ్రామ సచివాలయం స్థాయిలోని డిజిటల్ అసిస్టెన్స్ ద్వారా డాటా క్రోడీకరణ చేపట్టనున్నారు. రైతు భరోసా కేంద్రాలనుంచి ఈ క్రాపింగ్ డాటా ను సేకరించాలని భద్రపరిచే భాద్యతను తీసుకోవాలిని చెప్పారు. ఈ డాటా ఆధారంగా పరిపాలనలో లోపాలను ఎప్పటికప్పుడు బేరీజ్ ఏసుకుంటూ తదుపరి కార్యాచరణ రూపొందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. సుస్థిర సమగ్రాభివృద్ది కోసం ఐక్య రాజ్య సమితి నిర్దేశించిన 17 లక్ష్యాలను అందుకొనేలా ప్రపంచ బ్యాంక్, ఐఎమ్ఎఫ్, యునెస్కో వంటి ప్రపంచ స్థాయి సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు.