అనంతపురం జిల్లాలో మంగళవారం ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. తల్లీ కుమారుడిని మృత్యువు కరెంటు రూపంలో కాటేసింది. పెద్దపప్పూరు మండలం వరదాయపాలెంనకు చెందిన వెంకటలక్ష్మమ్మ(55), ఆమె కుమారుడు వెంకటస్వామి(36) తోటలో కూలి పనికోసం ద్విచక్రవాహనంపై బయల్దేరారు. పోలాల మధ్యలో ఉన్న బండ్లబాటపై అప్పటికే 33/11కేవీ  విద్యుత్‌ వైరు తెగిపడి ఉంది.   ప్రమాదవశాత్తూ ద్విచక్రవాహనం విద్యుత్‌ తీగలకు తగలడంతో మంటలు చెలరేగి ఇద్దరూ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు