రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులు ఒక గుర్తు తెలియని మృతదేహం కనుగొన్నారు.రైల్వే పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం రాత్ర 2 గంటల సమయంలో పలకనామ ఎక్స్ప్రెస్ లోకో పైలెట్ ఇచ్చిన సమాచారం ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి 19 సంవత్సరాల యువకుడు ట్రైన్ బయలుదేరుతున్న సమయంలో ట్రైన్ కి ఎదురుగా నిలబడటంతో ఢీ కొనగా మృతిచెందినట్టు జి ఆర్ పి పోలీసులు తెలిపారు.మృతుడి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు భీమవరం నియోజకవర్గం గునుపూడి గ్రామానికి చెందిన వడ్లమూడి రోహిత్ గుర్తించడం జరిగింది జిఆర్పి పోలీసులు తెలిపారు.మృతుడు విశాఖపట్నం సన్ ఇంటర్నేషనల్ కాలేజీలో సెకండియర్ చదువుతున్నట్లుగా ఐడి కార్డ్ ఆధారంతో గుర్తించడం జరిగిందని తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.