రికార్డు స్థాయిలో కొమురవెల్లి మల్లన్న  హుండీ ఆదాయం సమకూరింది.25 రోజుల్లో రూ.1,3,59,875 నగదు సమకూరింది. ఆలయంలో 12 గంటలపాటు హుండీ లెక్కింపు కొనసాగింది. ఆలయ ఈవో బాలాజీ ఆధ్వర్యంలో ఆదాయాన్ని మండల కేంద్రంలోని ఏపీజీవీబీ బ్యాంకులో  అధికారులు జమ చేశారు. కోటి రూపాయల నగదుతో పాటు  12 కిలోల మిశ్రమ వెండి, రెండున్నర క్వింటాళ్ల బియ్యం, వివిధ దేశాల కు చెందిన 15 కరెంట్ కరెన్సీ నోట్లు లభించాయి.