ఏపీలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా 24 గంటల వ్యవధిలో 492 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,94,536కి చేరింది. . ఒక్క రోజు వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించగా ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7193కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2616 యాక్టివ్‌ కేసులు నమోదవ్వగా 256 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,48,05,335 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.