అంతర్జాతీయం (International) వార్తలు (News)

మెక్సికో సరిహద్దు మూసివేసిన అమెరికా

మునుపటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వలసల విషయంలో కఠినంగా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే! బైడెన్‌ ఆ విధానాలను సవరిస్తారన్న ప్రచారం జరగడంతో చాలా దేశాల వారు మరియు పొరుగున ఉన్న గ్వాటెమాల, హోండురస్, ఎల్‌సాల్వెడార్‌లోని అంతర్గత గొడవల కారణంగా అనగా సరిహద్దులకు వలస వచ్చారు. ఇలా అక్రమంగా వలస వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో బైడెన్‌ ప్రభుత్వం మెక్సికోవైపు సరిహద్దులను మూసివేసిన కారణంగా మానవీయ, రాజకీయ సవాళ్లు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. పరిస్థితులను అదుపు చేయడానికి అంతర్గత భద్రత వ్యవహారాల మంత్రి అలెజాండ్రో మేయర్‌కోస్‌ స్వయంగా అక్కడికి వెళ్లి పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. మొత్తం కుటుంబంతో వచ్చిన వారిని, ఒంటరిగా వచ్చిన పురుషులను అక్కడ నుంచి తిప్పి పంపిస్తున్నామని, యువకులు, ఇబ్బందులు పడుతున్న పిల్లలను మాత్రం పంపించడం లేదని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.