మంగళవారం కాశ్మీర్‌కు ప్రవేశ ద్వారం “జవహర్ టన్నెల్ ఏరియా”లో భారీ హిమపాతం మరియు బనిహాల్, ఛందేర్​కోటె ప్రాంతాల మధ్యలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా హైవేకి రెండు వైపులా 300కి పైగా వాహనాలు రహదారులపైనే నిలిచిపోయాయి.
చాలా ప్రాంతాల్లో వర్షాలు కూడా కురిసాయని, సోమవారం రాత్రి నుంచే వందల సంఖ్యలో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయని, సహాయక చర్యలు చేపట్టి రంబన్​ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించినట్లు ట్రాఫిక్ డీఎస్పీ పరూల్ భరద్వాజ్ పేర్కొన్నారు. జమ్ములోని రంబన్, దోడ, కిస్తవార్ ప్రాంతాల్లో మంచు భారీగా కురుస్తుందని, సోమవారం ఉష్ణోగ్రత 16.2 డిగ్రీలు, మంగళవారం 14.9 డిగ్రీ సెల్సియస్​ల ఉష్ణోగ్రత నమోదైందని స్పష్టం చేశారు.