తెలంగాణలో రోజురోజుకి కొత్త కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. సోమవారం రాత్రి 8 గంటల వరకు 68,171 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కొవిడ్‌తో ముగ్గురు మృతిచెందడంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,674కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,151 ఉండగా.. వీరిలో 1,285 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మరియు 216 మంది కోలుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 103 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది.