క్రితం రోజుతో పోల్చుకుంటే సోమవారం కొత్త కేసులు 13శాతం మేర తగ్గడంతో ప్రజలు కాస్త ఊపిరి తీసుకున్నారు. గడిచిన 24 గంటల్లో 40,715 మందిక వైరస్ బారిన పడడంతో 199 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దాంతో ఇప్పటివరకు 1,16,86,796 మంది కొవిడ్ బారిన పడగా వారిలో మరణాలు 1.6లక్షల మార్కును దాటాయి. క్రియాశీల కేసులు మాత్రం 3,45,377(2.87 శాతం)కి పెరిగాయి. 29,785 మంది కొవిడ్‌ నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు 1.11 కోట్ల మందికి పైగా వైరస్ నుంచి కోలుకున్నారు. దీనితో రికవరీ రేటు 95.75 శాతానికి చేరింది.