ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ వినియోగదారులు గత కొద్ది రోజులుగా గూగుల్ పే, గూగుల్ క్రోమ్ వంటి కొన్ని ఆండ్రాయిడ్ అప్లికేషన్లు క్రాష్ అవుతుండడంతో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. భారతదేశంలో కూడా ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు జీమెయిల్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆండ్రాయిడ్ జీమెయిల్ అప్లికేషన్ తరచూ క్రాష్ అవుతుందని ప్రపంచవ్యాప్తంగా ఫిర్యాదులు వస్తున్నాయి.దీంతో ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ గూగుల్ స్పందించింది.

ప్రపంచవ్యాప్తంగా చాలామంది యూజర్లు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో జీమెయిల్ అప్లికేషన్ ని ఓపెన్ చేయలేకపోతున్నారని.ఓపెన్ చేసిన కొద్ది క్షణాల్లోనే అప్లికేషన్ క్రాష్ అవుతుందని, ఈ సమస్యను మేము కూడా గుర్తించామని గూగుల్ సంస్థ ప్రకటించింది.అయితే ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న వినియోగదారులు తాత్కాలికంగా డెస్క్ టాప్ వెర్షన్ లో జీమెయిల్ సేవలను ఉపయోగించమని గూగుల్ సంస్థ విజ్ఞప్తి చేసింది. అతి త్వరలోనే ఈ సమస్యకు ప్రరిష్కారం కనుగొంటామని గూగుల్ సంస్థ వినియోగదారులకి హామీ ఇచ్చింది.

ఇక సౌత్ కొరియన్ మొబైల్ కంపెనీ సాంసంగ్ కూడా జీమెయిల్ అప్లికేషన్ క్రాష్ సమస్య పై స్పందిస్తూ సాంసంగ్ కంపెనీ మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్న యూజర్లు ఒక చిన్న సెట్టింగ్ మార్చితే ఈ సమస్య నుంచి బయట పడవచ్చని తెలిపింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. సాంసంగ్ యూజర్లు ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి, యాప్స్ సెక్షన్ పై క్లిక్ చేసి, సిస్టం అప్లికేషన్ల కోసం చెక్ చేసిన అనంతరం వెబ్ వ్యూ(WebView) అప్లికేషన్ పై క్లిక్ చేసి, కుడి వైపు పై భాగంలో ఉన్న మూడు డాట్స్ పై నొక్కండి. అప్పుడు “అన్ఇన్స్టాల్ అప్డేట్” అనే ఆప్షన్ కనిపిస్తుంది.ఆ ఆప్షన్ పై క్లిక్ చేస్తే అప్డేట్స్ అన్ఇన్స్టాల్ అవుతాయి. దీనితో జీమెయిల్ క్రాష్ సమస్య నుంచి సెకండ్ల సమయంలో బయటపడవచ్చు.సామ్సంగ్ వినియోగదారులే మాత్రమే కాదు ఇతర కంపెనీ ఫోన్లు ఉపయోగించే వినియోగదారులు కూడా ఇదే తరహాలో సెట్టింగ్స్ మార్చుకుని జీమెయిల్ అప్లికేషన్ని యాక్సెస్ చేయవచ్చని వివరించారు.