షావోమి ఇండియా హార్డ్‌షిప్‌ బోనస్‌కింద ఉద్యోగులకు15 రోజుల జీతాన్ని బోనస్ ప్రకటించింది. కరొనతో ఇబ్బందులను ఎదుర్కొన్న కార్పొరేట్‌ ఉద్యోగులతోపాటు ఇతరలకు వార్షిక బిజినెస్‌ బోనస్‌కు అదనంగా ఈ బోనస్‌ను అందించనుంది. తన ఉద్యోగులందరితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీ 60వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులను కలిగి ఉంది. లాక్‌డౌన్‌ తరువాత దేశీయ డిమాండ్ పెరగడంతో, ఎగుమతులను నిలిపివేయాలని భావిస్తున్నట్టు, స్థానిక డిమాండ్‌కే తమ తొలి ప్రాధాన్యమని, డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక (పిఎల్‌ఐ) పథకంలో భాగంగా తన భాగస్వాములతో కలిసి దేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరిస్తున్నామని చెప్పారు. సీఎంఆర్ ఇండియా డేటా ప్రకారం 2020 మూడవ త్రైమాసికంలో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో టాప్‌లో ఉంది షావోమి. 27 శాతం మార్కెట్ వాటాతో మార్కెట్‌ లీడర్‌గా ఉంది.