క్రైమ్ (Crime) వార్తలు (News)

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల భారీ దాడి

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం మావోయిస్టులు మరోసారి జవాన్లతో వస్తున్న బస్సును శక్తివంతమైన ఐఈడీతో పేల్చి భారీ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అమరులవ్వగా మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో గాయపడిన పలువురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన నారాయణపూర్ జిల్లాలోని కడేనార్, కన్హరగావ్ మధ్య ఈ ఘటన జరిగింది. దట్టమైన అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టి తిరిగొస్తున్న జవాన్లను లక్ష్యంగా చేసుకొని ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనలో ముగ్గురు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అమరులయ్యారు. ఆ సమయంలో బస్సులో మొత్తం 27 మంది గార్డ్స్ (పోలీసులు) ఉన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందగానే ఐటీబీపీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఎయిర్‌లిఫ్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.