వార్తలు (News)

తెలంగాణలో పాఠశాలల మూసివేత

తెలంగాణ ప్రభుత్వం పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు, ఆన్‌లైన్‌ తరగతులు యథావిధిగా కొనసాగేటట్టు నిర్ణయించుకున్నారు. తెలంగాణలోనే కాక పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతున్నందున కరోనా తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలను మూసివేశాయి. మన రాష్ట్రంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి. సమీక్షించిన తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నింటినీ రేపటి నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.